Viral Video: ఆర్టీసీ డ్రైవర్ వ్యవహరించిన తీరుకు IAS అధికారి ఫిదా.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-04-08T01:20:39+05:30 IST

వెంట వచ్చిన వారిని ప్రమాదం నుంచి రక్షించే వారిని సాధారణంగా హీరో అంటామన్న విషయం అందరికీ తెలిసిందే. ‘హీరో’ పదానికి గల డెఫినేషన్‌ను ప్రస్తుతం గుర్తు చేసుకోవడం వెనక ఓ పెద్ద కారణమే ఉంది. కేరళ రో

Viral Video: ఆర్టీసీ డ్రైవర్ వ్యవహరించిన తీరుకు IAS అధికారి ఫిదా.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: వెంట వచ్చిన వారిని ప్రమాదం నుంచి రక్షించే వారిని సాధారణంగా హీరో అంటామన్న విషయం అందరికీ తెలిసిందే. ‘హీరో’ పదానికి గల డెఫినేషన్‌ను ప్రస్తుతం గుర్తు చేసుకోవడం వెనక ఓ పెద్ద కారణమే ఉంది. కేరళ రోడ్డు రవాణా సంస్థలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి చేసిన పనికి ఏకంగా ఓ ఐఏఎస్ అధికారి ఫిదా అయ్యారు. ప్రశంసలు కురిపిస్తూ అతడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు.. ఆ డ్రైవర్‌ను ‘హీరో’గా అభివర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ అతడు ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే..


50 మంది ప్రయాణికులతో కేఎస్ఆర్టీసీ బస్సు కేరళలోని మున్నార్ నుంచి తమిళనాడులోని ఉడుమల్పేట్‌కు బుధవారం సాయంత్రం బయల్దేరింది. ఈ క్రమంలో బస్సు అడవి గుండా ప్రయాణిస్తూ.. ఓ మూల మలుపు వద్దకు చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో స్థానికంగా పడయప్ప అని పిలిచే అడవి ఏనుగు ఎదురైంది. అది చూసి  బస్సును డ్రైవర్ అక్కడే నిలిపివేశాడు. ఈ నేపథ్యంలో బస్సులోని ప్రయాణికులు ఏనుగును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. ఇంతలో ఆ ఏనుగు.. బస్సు వైపునకు రావడం మొదలుపెట్టింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు. నిశ్శబ్దంగా ఉంటూనే బెంబేలెత్తిపోయారు. అయితే డ్రైవర్ మాత్రం ఆందోళన చెందలేదు. ఏ మాత్రం కంగారుపడకుండా ఏనుగు కదలికలను గమనించాడు. 



ఈ క్రమంలో బస్సు వద్దకు చేరుకున్న ఏనుగు.. బస్సుపై భాగాన్ని తొండంతో తడిమింది. ఈ సమయంలో దాని దంతాలు బస్సు అద్దానికి తగలడంతో అది పగుళ్లు పెట్టింది. అయినప్పటికీ ఆ బస్సు డ్రైవర్ ఒత్తిడికి గురికాలేదు. ఏనుగు కాస్తా పక్కకు తప్పుకోనే వరకూ వేచి చూసి.. అనంతరం బస్సును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహూ కంటపడింది. 50 మందిని ప్రమాదం నుంచి తప్పించేందుకు ఆ డ్రైవర్ వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యారు. డ్రైవర్‌ను మిస్టర్ కూల్‌గా అభివర్ణిస్తూ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు ఆ డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 




Updated Date - 2022-04-08T01:20:39+05:30 IST