జిహాదీలను ఎదుర్కోవడానికి విల్లులు, బాణాలు ఇంట్లో పెట్టుకోండి: బీజేపీ ఎంపీ

ABN , First Publish Date - 2022-04-25T02:29:52+05:30 IST

ఈ గుంపు అకస్మాత్తుగా మీ వీధికి లేదా మీ ఇంటికి వస్తే, దానిని నివారించడానికి మీకు కొంత మార్గం ఉంది. మిమ్మల్ని రక్షించడానికి పోలీసులు రాకపోగా తమను తాము రక్షించుకోవడానికి ఏదో ఒక షెల్టర్‌లో దాక్కుంటారు. వీళ్లంతా వచ్చి తమ జిహాదీ చేసి వెళ్లిన..

జిహాదీలను ఎదుర్కోవడానికి విల్లులు, బాణాలు ఇంట్లో పెట్టుకోండి: బీజేపీ ఎంపీ

లఖ్‌నవూ: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే భారతీయ జనతా పార్టీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహాదీలంతా గుంపుగా వస్తే హిందువులకు పోలీసులు ఎలాంటి సహాయం అందించరని అందుకే హిందువులు తమ ఇళ్లల్లో విల్లులు, బాణాలు పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు.


ముస్లిం వ్యక్తులు కర్రలతో గుంపుగా పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఈ గుంపు అకస్మాత్తుగా మీ వీధికి లేదా మీ ఇంటికి వస్తే, దానిని నివారించడానికి మీకు కొంత మార్గం ఉంది. మిమ్మల్ని రక్షించడానికి పోలీసులు రాకపోగా తమను తాము రక్షించుకోవడానికి ఏదో ఒక షెల్టర్‌లో దాక్కుంటారు. వీళ్లంతా వచ్చి తమ జిహాదీ చేసి వెళ్లిన కొన్ని రోజులకు పోలీసులు వస్తారు. వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు. ఆ తర్వాత విచారణ అంటారు. కేసు మూసేస్తారు. ఇలాంటి అతిథుల కోసం ఒకటి రెండు బాక్సుల శీతల పానీయాలతో పాటు కొన్ని బాణాలు, విల్లులు ఇంట్లో పెట్టుకోండి. ఈ సందేశం ఏ ఒక్క రాష్ట్రానికో కాదు దేశం మొత్తానికి’’ అని రాసుకొచ్చారు. చివర్లో జై శ్రీరాం అంటూ రాసుకొచ్చారు.

Updated Date - 2022-04-25T02:29:52+05:30 IST