కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2021-10-26T04:23:15+05:30 IST

కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం
చేవెళ్ల : నగరానికి తరలిన ఎమ్మెల్యే యాదయ్య, నాయకులు

  • చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య 
  • ప్లీనరీకి తరలిన టీఆర్‌ఎస్‌ నేతలు 

చేవెళ్ల/ఆమనగల్లు: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ 20 వసంతాల ప్లీనరీ నిర్వహించారు. చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, నవాబ్‌పేట్‌ మండలాల ప్రజాప్రతినిధులు, అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి ప్లీనరిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకరవర్గ యూత్‌వింగ్‌ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరికి ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాల నుంచి ఎంపిక చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌ హైటెక్స్‌కు తరలివెళ్లారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి ఆయా మండలాల నాయకులు టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ప్లీనరీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ప్లీనరీకి పరిమిత సంఖ్యలో పాసులు జారీ చేసినప్పటికి మండలాల నుంచి నాయకులు పెద్ద సంఖ్యలోనే అక్కడికి వెళ్లారు. సభకు వెళ్లిన వారిలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌రావు, జైపాల్‌రెడ్డి, శంకర్‌, పరమేశ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి,  మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌ చైర్మన్‌ తోట గిరియాదవ్‌, వైస్‌ ఎంపీపీ లు జక్కు అనంతరెడ్డి, శంకర్‌నాయక్‌, మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్‌, అనురాధపత్యనాయక్‌, ఎంపీపీలు కమ్లీమోత్యనాయక్‌, అనితవిజయ్‌, నాయకులు బాచిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, లచ్చిరామ్‌నాయక్‌, దోనాదుల కుమార్‌, తదితరులున్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో యాచారం జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, సొసైటీ చైర్మన్‌ టి.రాజేందర్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు కె.రమే్‌షగౌడ్‌,. పి.బాషా, రైతు సమన్వయ సమితి మండల చైర్మన్‌ జోగిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T04:23:15+05:30 IST