తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కేసీఆర్ కాదు: తరుణ్ చుగ్

ABN , First Publish Date - 2022-07-02T01:29:21+05:30 IST

Hyderabad: కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో‌ సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కేసీఆర్ కాదు: తరుణ్ చుగ్

Hyderabad: కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో‌ సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు.  ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ సర్కార్ విఫలమైందని, తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కేసీఆర్ కాదని, కేటీఆర్, హరీష్, కవిత  నడుపుతున్నారని  విమర్శించారు. స్వాతంత్ర్యం రాకముందు నిజాం హయంలో జరిగిన అత్యాచారాలు, సజీవ దహనాలు తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని ఆరోపించారు. 


త్వరలో తెలంగాణాకు కుటుంబ, అవినీతి పాలన నుంచి విముక్తి  

‘‘తెలంగాణలో బీజేపీ చాలా వేగంగా బలపడుతోంది. ఉద్యమకారులంతా బీజేపీలోకి వస్తున్నారు. తెలంగాణ ప్రజలు ప్రధాని మోదీ, బీజేపీని చాలా ఇష్టపడతారు. 520 రోజుల తరువాత తెలంగాణాకు కుటుంబ, అవినీతి పాలన నుంచి విముక్తి లభిస్తుంది. జూలై 2వ తేదీ ఉదయం 8.30 గంటలకు పదాధికారుల సమావేశం, సాయంత్రం 4 గంటలకు కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తాం.’’ అని  తరుణ్ చుగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-02T01:29:21+05:30 IST