బాసర భక్తుల కష్టాలు కేసీఆర్‌కు పట్టవా: Vijayashanti

ABN , First Publish Date - 2022-07-22T02:00:46+05:30 IST

Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పాలనపై మరోసారి ధ్వజమెత్తారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే బాసర క్షేత్రం సమస్యలకు కొలువైందన్నారు. ఎన్నికల సమయంలో బాసర ఆలయ రూపురేఖలు మారుస్తానన్న కేసీఆర్.. భక్తులు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదని సోషల్

బాసర భక్తుల కష్టాలు కేసీఆర్‌కు పట్టవా: Vijayashanti

Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijaya Shanti)  సీఎం కేసీఆర్ (KCR) పాలనపై మరోసారి ధ్వజమెత్తారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే బాసర (Basara) క్షేత్రం సమస్యలకు కొలువైందన్నారు. ఎన్నికల సమయంలో బాసర ఆలయ రూపురేఖలు మారుస్తానన్న కేసీఆర్.. భక్తులు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. విజయశాంతి పోస్టు యథాతథంగా..


‘‘బాసర సరస్వతీ క్షేత్రంలో సమస్యలు రాజ్యమేలుతున్నయి. అమ్మవారి సన్నిధిలో ఒకటి ఉంటే... ఒకటి ఉండదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. 2018 ఎలక్షన్​ టైంలో సీఎం కేసీఆర్ రూ.100 కోట్లతో బాసర ఆలయ రూపురేఖలు మారుస్తనని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు. ఏటా అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తరు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తరు. గంటల తరబడి క్యూ లైన్​లో నిలబడి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి మొక్కులు సమర్పించుకుంటరు. ప్రభుత్వం తరఫున ఏటా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తరు. అయినా ప్ర‌భుత్వం మాత్రం అల‌స‌త్వం వీడ‌డం లేదు. ఆలయానికి ఏళ్లకేళ్లుగా ఇన్​చార్జి ఈవోనే కొనసాగుతున్నడు. భక్తులకు తాగేందుకు మంచినీరు కూడా దొరకడం లేదు. సరిపడా టాయిలెట్స్​ లేవు. సత్రాల్లో ఉండే టాయిలెట్స్ సరిగ్గా పనిచేయడంలేదు. ఉన్న వాటిలో కొన్నింటికి నీటి సౌకర్యం లేదు. స్నానాలకు వేడి నీళ్లు దొరకడంలేదు. టీటీడీ సత్రం, చుట్టుపక్కల సత్రాల్లో ఉండే వారు రెండు మూడు అంతస్తులు దిగి వేడి నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సమస్యల్ని పరిష్కరించి, ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఆఫీసర్లు మాస్టర్​ ప్లాన్​ రూపొందించినా.. అది కాగితాలకే పరిమితమైంది. విశాలమైన స్థలం, గర్భాలయ వెడల్పు, మాడవీధులు, ప్రత్యేక మండపం, షాపింగ్ కాంప్లెక్స్, క్యూ లైన్​ కాంప్లెక్స్, టాయిలెట్స్​కోసం వేసిన మాస్టర్​ ప్లాన్​ ముందుకు సాగడంలేదు. కేసీఆర్ చెప్పిన వంద కోట్ల హామీ నీటి ముటలా మిగిలిపోయింది. అమ్మవారికి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అయినా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టడంలేదు.’’ అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-22T02:00:46+05:30 IST