క్యాంపస్‌ సెలక్షన్స్‌లో 28 మందికి ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-01-29T06:19:34+05:30 IST

కేబీఎన్‌ కళాశాల క్యాంపస్‌ సెలక్షన్‌లో ఎంపికయిన విద్యార్థులకు శుక్రవారం కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అభినందనలు తెలియచేశారు.

క్యాంపస్‌ సెలక్షన్స్‌లో 28 మందికి ఉద్యోగాలు
క్యాంపస్‌ సెలక్షన్‌లో ఎంపికైన విద్యార్థులు

క్యాంపస్‌ సెలక్షన్స్‌లో 28 మందికి ఉద్యోగాలు

వన్‌టౌన్‌, జనవరి 28: కేబీఎన్‌ కళాశాల క్యాంపస్‌ సెలక్షన్‌లో ఎంపికయిన విద్యార్థులకు శుక్రవారం కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ నారాయణరావు మాట్లాడుతూ, కళాశాలలో ఇటీవల జరిగిన క్యాంపస్‌ సెలక్షన్లలో ఎంపికయిన 28 మంది విద్యార్థులకు  సగటున నాలుగు నుంచి ఐదు లక్షల మేరకు వార్షిక వేతనం ఉంటుందన్నారు. అంతర్జాతీయ యూనివర్సిటీ ద్వారా తొమ్మిది మాసాల సర్టిఫికేట్‌ కోర్సుకు కంపెనీనే ఖర్చులు భరించి చేయిస్తుందన్నారు. కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాస్‌ విద్యార్థులను ,ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ను అభినందించారు. ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ పీఎల్‌ రమేష్‌, టీ విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T06:19:34+05:30 IST