ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన కౌటాల, రెబ్బెన యువకులు

ABN , First Publish Date - 2022-02-25T05:53:34+05:30 IST

మండలంలోని లంబాడిహెట్టి (గుప్పగూడెం) గ్రామానికి చెందిన జటోత్‌శ్యాంలాల్‌ కుమా రుడు జటోత్‌ సాయికిరణ్‌ అనేయువకుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన కౌటాల, రెబ్బెన యువకులు
జటోత్‌ సాయికిరణ్‌

చింతలమానేపల్లి/కౌటాల ఫిబ్రవరి 24: మండలంలోని లంబాడిహెట్టి (గుప్పగూడెం) గ్రామానికి చెందిన జటోత్‌శ్యాంలాల్‌ కుమా రుడు జటోత్‌ సాయికిరణ్‌ అనేయువకుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు. ఉక్రెయిన్‌- రష్యా మధ్యయుద్ధం జరుగుతున్న వేళ సాయికిరణ్‌ అక్కడ చిక్కుకుపోవడంతో కుటుంబీకుల్లో భయాందోళన నెలకొంది. అయితే ఆంధ్రజ్యోతి గురువారం రాత్రి సాయికిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడగా తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు తెలిపాడు. ఇప్పటికే తనమిత్రులు ఇండియా బయ ల్దేరుదామని వెళ్లగా మధ్యలో చిక్కుకుపోయారన్నాడు. తాము కూడా ఇండియాకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికైతే తమ ప్రాంతంలో బాంబుల దాడి జరుగలేదన్నాడు. తాము ఉండే ప్రాంతంలో పెద్ద పవర్‌ప్లాంట్‌ఉందని దానిపై దాడిచేసే అవకాశం ఉన్నట్లుగా తెలు స్తోందని పేర్కొన్నాడు. దాడి జరిగితే రేడియేషన్‌ వల్ల ఈ ప్రాంతానికి ముప్పు వాటిళ్లే అవకాశం ఉందని భారతప్రభుత్వం తమరక్షణకోసం చర్యలు తీసుకో వాలని కోరాడు.

రెబ్బెన: మండలకేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీడాక్టర్‌ రవి, స్వూరూపల కుమారుడు గుండు హరిప్రసాద్‌(20) ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం తూర్పు ప్రాంతంలో యుద్ధం ప్రారంభమైంది. గురువారం రాత్రి తల్లిదండ్రులతో ఫోన్‌లోమాట్లాడిన హరిప్రసాద్‌ ప్రస్తుతం ఇక్కడఎటువంటి ఇబ్బంది లేదని సాధ్యమైనంత త్వరగా తననుఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరాడు.

Updated Date - 2022-02-25T05:53:34+05:30 IST