కాట్పాడి - తిరుపతి ప్యాసింజర్‌ రద్దు

ABN , First Publish Date - 2022-01-22T05:17:16+05:30 IST

కొవిడ్‌ ఉధృతితో పాటు పాటు ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో కాట్పాడి - తిరుపతి మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలు రెండు సర్వీసులను శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కాట్పాడి - తిరుపతి ప్యాసింజర్‌ రద్దు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 21: కొవిడ్‌ ఉధృతితో పాటు పాటు ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో కాట్పాడి - తిరుపతి మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలు రెండు సర్వీసులను శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాట్పాడిలో ఉదయం 6 గంటలకు బయలుదేరి చిత్తూరు, పాకాల మీదుగా 8గంటలకు తిరుపతికి చేరే ప్యాసింజర్‌ సర్వీస్‌ రద్దయింది. అదేవిధంగా తిరుపతిలో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి కాట్పాడికి 9.30 గంటలకు చేరే సర్వీస్‌ రద్దయింది. కాగా, కాట్పాడిలో మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరుపతికి చేరే సర్వీసు, తిరుపతిలో ఉదయం 6.40 గంటలకు బయలుదేరి 8.40 గంటలకు కాట్పాడికి చేరే సర్వీసు యధావిధిగా కొనసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-22T05:17:16+05:30 IST