Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మహిళా చేతన’ను ఆశ్రయించిన యువతి

విశాఖపట్నం: ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డుగా ఉన్నారని.. విశాఖ మధురవడకి చెందిన పేరు బోణీ భార్గవి(22).. శుక్రవారం మహిళ చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మను ఆశ్రయించారు. తనకి ఇష్టం లేని వెళ్లి  చేస్తున్నారని చెప్పింది. ఉదయం 100కి కాల్ చేసి ఫిర్యాదు చేశానని వివరించింది.

వివరాల్లోకి వెళ్తే.. సాయి అనే యువకుడితో.. భార్గవి కొంత కాలంగా ప్రేమలో ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతిపై చేయి చేసుకున్నారు. తర్వాత భార్గవిని కొన్నాళ్లు ఒరిస్సాలో ఉంచినట్లు తెలిసింది. దీనిపై కత్తి పద్మ మాట్లాడుతూ.. భార్గవి తరపున మద్దతు తెలిపేందుకు వెళ్తే.. తమపై కూడా దాడి చేశారని ఆరోపించారు. యువతికి తాము అండగా ఉంటామన్నారు. యువకుడు మంచి వ్యక్తి కాకపోతే వారి పెళ్లికి తాము కూడా అంగీకరించమని తెలిపారు.

Advertisement
Advertisement