కాటంరాజు మార్గాన్ని అనుసరించాలి

ABN , First Publish Date - 2021-04-13T05:49:55+05:30 IST

కాటంరాజు చరిత్ర ఎంతో గొప్పదని, ఆయన మార్గాన్ని యాదవులు అందరూ అనుసరించాలని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ అన్నారు. స్థానిక యాదవ జేఎసీ కార్యాలయంలో సోమవారం కాటమరాజు, గంగాభవాని తిరునాళ్ల సందర్భంగా యాదవ సోదరుల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా కాటంరాజు చిత్రపటానికిపూలమాలలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ ఉగాది ముందు రోజు కాటంరాజు తిరునాళ్ల జరుపుకోవడం సంతోషకరమన్నారు.

కాటంరాజు మార్గాన్ని అనుసరించాలి
యాదవ జేఏసీ సమావేశంలో మాట్లాడుతున్న ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌




ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 12 : కాటంరాజు చరిత్ర ఎంతో గొప్పదని, ఆయన మార్గాన్ని యాదవులు అందరూ అనుసరించాలని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ అన్నారు. స్థానిక యాదవ జేఎసీ కార్యాలయంలో సోమవారం కాటమరాజు, గంగాభవాని తిరునాళ్ల  సందర్భంగా యాదవ సోదరుల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా కాటంరాజు చిత్రపటానికిపూలమాలలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ ఉగాది ముందు రోజు కాటంరాజు తిరునాళ్ల జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా యాదవ పెద్దలు కొల్లిబోయిన వెంకయ్య, అడకా స్వాములు, అంగిరేకుల గురవయ్య, కటారి ప్రసాద్‌, ధనలక్ష్మీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు, ప్రతినిధులు కోటి, దుర్గామల్లేశ్వరి, బొట్ల సుబ్బారావు, పిన్నిక శ్రీనివాసులు, కే సురేష్‌, కే నాగేశ్వరరావు, కే అజయ్‌, మిరియం రాంబాబు, శివ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-13T05:49:55+05:30 IST