Karunanidhi సమాధి వద్ద కలం ఆకార స్తూపం

ABN , First Publish Date - 2022-07-23T13:55:25+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి సమాధి వద్ద నిర్మించనున్న స్మారకమందిరం వెనుకవైపు సముద్రంలో 42 మీటర్లు (134 అడుగులు) ఎత్తులో

Karunanidhi సమాధి వద్ద కలం ఆకార స్తూపం

పెరంబూర్‌(చెన్నై), జూలై 22: మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి సమాధి వద్ద నిర్మించనున్న స్మారకమందిరం  వెనుకవైపు సముద్రంలో 42 మీటర్లు (134 అడుగులు) ఎత్తులో కలం ఆకారంలో ఓ స్మారక స్తూపాన్ని నిర్మించనున్నారు. ఈ స్థూపాన్ని నిర్మించడానికి రాష్ట్ర సముద్రతీర నియంత్రణా మండలి అనుమతులు మంజూరు చేసింది. మెరీనా తీరంలో 2.21 ఎకరాల విస్తీర్ణంలో రూ.39 కోట్లతో కరుణానిధి సమాధివద్ద స్మారక మండపం నిర్మంచనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గత అసెంబ్లీ సమావేశాల్లో  ప్రకటించారు. కరుణానిధి సినీ, రాజకీయ, జీవిత విశేషాలను సందర్శకులకు తెలిసేలా ఈ స్మారక మందిరంలో పలు నిర్మాణాలు చోటుచేసుకోనున్నాయి. డీఎంకే చిహ్నమైన ‘ఉదయించే సూర్యుడు’ ఆకారంలో నిర్మించనున్న ఈ స్మారక మందిరం వెనుకవైపు సముద్ర మట్టం నుంచి 42 మీటర్ల ఎత్తున కలం ఆకారంలో స్మారక స్తూపం నిర్మించేందుకు అనుమతులు లభించాయి. రూ.81 కోట్లతో రూపొందనున్న ఈ స్మారక స్థూపానికి కరుణ సమాధికి మద్య సందర్శకులు వెళ్లేలా ప్రత్యేక వంతెన కూడా నిర్మించనున్నారు. కన్నియాకుమారిలోని తిరువళ్లువర్‌ విగ్రహం కంటే ఈ కలం ఆకార స్మారక స్తూపం మరింత ఎత్తుంటుంది.. ప్రస్తుతం ఈ స్మారక స్తూపం నిర్మాణ పథకాన్ని కేంద్రప్రభుత్వ అనుమతి కోసం పంపినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-23T13:55:25+05:30 IST