భక్తి శ్రద్ధలతో కార్తీక సోమవారం

ABN , First Publish Date - 2020-11-24T06:12:36+05:30 IST

యాగంటి క్షేత్రాన్ని కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా భారీగా భక్తులు దర్శించు కున్నారు.

భక్తి శ్రద్ధలతో కార్తీక సోమవారం
యాగంటిలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

కార్తీక సోమవారం విశిష్టమైన రోజు. భక్తులు పుణ్య స్నానాలు చేసి ఆలయాల్లో పూజలు చేశారు. దీపాలు వెలిగించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో శివారాధనలు, దీపోత్సవాలు నిర్వహించారు.

 

బనగానపల్లె, నవంబరు 23: యాగంటి క్షేత్రాన్ని కార్తీక మాసం రెండో  సోమవారం సందర్భంగా భారీగా భక్తులు  దర్శించు కున్నారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  ఉదయం 5గంటలకు మమన్యాసక ఏకాదశ రుద్రాభిషేకాలు, కుంకుమార్చన, సహస్రనామావళి, మహానివేదన ఉచిత ప్రసాద వితరణ, సాయంత్రం 6.30 గంటల కు పల్లకి సేవ  నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో డీఆర్‌కెఆర్‌ ప్రసాద్‌, ఆలయ పూజారులు, సిబ్బంది, ప్రత్యేక చర్యలు చేపట్టారు.  ఆలయ ధ్వజ స్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.  పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఆళ్లగడ్డ, : గ్రామాల్లోని మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం రెండో సోమవారాన్ని జరుపుకున్నారు. పట్టణంలోని శివాలయంలో, శివారు ప్రాంతంలోని కాశీ విశ్వేశ్వరునికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, విశేష పూజలు చేశారు.


చాగలమర్రి: మండలంలోని రామలింగేశ్వర, భీమలింగేశ్వర, బుగ్గమల్లేశ్వర, భైరవేశ్వర ఆలయాల్లో కార్తీక సోమవారం సందర్భంగా శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.  రామలిం గేశ్వర, భీమలింగేశ్వర ఆలయాల్లో మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. ఆలయాల్లో శివపార్వతుల పల్లకి మహోత్సవం నిర్వహించారు. బుగ్గమల్లేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు శివప్రసాద్‌, మేడాబాబు, సత్యం ఆధ్వర్యంలో ఈశ్వరుడికి అభిషేకాలు చేశారు. రామలింగేశ్వర ఆలయంలో వాసవీ మహిళలు పార్వతిదేవి సామూహిక వడిబియ్యం కార్యక్రమం, లలిత పారాయణం చేశారు.


నంద్యాల (కల్చరల్‌): నంద్యాల అమ్మ స్పటిక లింగేశ్వరాలయంలో సోమవారం కార్తీక మాస ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్పటిక లింగేశ్వరునికి అభిషేకాలు, స్వామివారికి కుంకుమతో అలంకారం, స్వామివారి ఉత్సవం, ఆకాశదీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు యోగాచార్యులు అచల పరిపూర్ణాయోగానంద పాములేటి స్వామి, భక్తులు పాల్గొన్నారు.


  నంద్యాల బాలాజీ కాంప్లెక్స్‌ కళ్యాణ మండపంలో కార్తీకమాసం సోమవారం మహన్యాసపూర్వక సహస్ర రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండప అధ్యక్షుడు కశెట్టి క్రిష్ణమూర్తి, దేసు చరణ్‌దాసు గుప్తా, కశెట్టి చంద్రశేఖర్‌, దుద్దేల సురేష్‌బాబు  పాల్గొన్నారు.

బండి ఆత్మకూరు: నల్లమలలోని ఓంకార క్షేత్రం కార్తీక సోమవారం సందర్భంగా ఓంకారం నాదం మార్మోగింది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం భక్తులు క్యూలైన్లో నిల్చుని గంగా, ఉమా సమేత సిద్ధ్దేశ్వర స్వామి వార్లను దర్శించి మొక్కులు సమర్పించుకున్నారు.  పద్మావతి సహిత శ్రీనివాస, కామాక్షి, వీరభోగ వసంతరాయ ఆలయాలకు కాలినడకన వెళ్ళి భక్తులు దర్శించుకొన్నారు. కాశీనాయన ఆశ్రమంలో భక్తులకు అన్నదానం చేశారు.


మిడుతూరు: మండలంలోని ఆలయాల్లో కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉప్పలదడియ గ్రామంలో మహిళలు వీరభద్రుడికి, ఉసిరి చెట్టుకు, నాగుల కట్టలకు ప్రత్యేక పూజలు చేశారు.


ఓర్వకల్లు: మండలంలోని  కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం రెండో సోమవారం భక్తులు పూజలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఆలయానికి చేరుకుని కోనేటిలో స్నానాలు ఆచరించి శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరిపి దీపాలు వెలిగించారు. కాల్వబుగ్గ మాజీ చైర్మన్‌ చంద్రపెద్దస్వామి ఆలయంలో పూలాంకరణలు చేయించి మహాశివునికి అభిషేకపూజలు జరిపారు. ఆలయ చైర్మన్‌ రమణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు.

 

గడివేముల: దుర్గాభోగేశ్వరం రెండో సోమవారం పురస్కరించు కొని భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి పంచ కోనేర్లలో స్నానం ఆచరించారు. దుర్గాభో గేశ్వరుడికి బాలత్రిపురాంబకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీరె డ్డినాయన ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు.  ఆలయ కార్యని ర్వాహణాధికారి చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక చర్య లు తీసుకున్నారు. 

Updated Date - 2020-11-24T06:12:36+05:30 IST