Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్తీక వైభవం

  1. శ్రీగిరిపై భక్తుల రద్దీ


శ్రీశైలం, నవ ంబరు 28: శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక సోమవారం నేపథ్యంలో ముందురోజు ఆదివారం  భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో శ్రీగిరి కిక్కిరిసింది. ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధర మండపం వద్ద భక్తులు  కార్తీక దీపాలను వెలిగించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించారు. స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ నిర్వహించారు. అఖండ శివ భజనలు కొనసాగుతున్నాయి. దర్శనం క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, వేడిపాలు, అల్పాహారం అందజేశారు. దర్శనానంతరం అన్నప్రసాదం అందజేస్తున్నారు. ఈవో లవన్న పర్యవేక్షిస్తున్నారు. రద్దీ కారణంగా హఠకేశ్వరం వరకు దాదాపు 5 కి.మీ. వాహనాలు నిలిచిపోయాయి.  అధికారులు దారి మళ్లించి పరిస్థితిని చక్కదిద్దారు.


నేడు లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి


నేడు నాలుగో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనుంది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం పుష్కరిణికి దశవిధ హారతులు ఇస్తారు. పుష్కరిణి ప్రాంగణమంతా దీపాలను ఏర్పాటు చేస్తారు. 

Advertisement
Advertisement