వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-01-16T04:21:43+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కొవిడ్‌ టీకా వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది.

వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
కొవాగ్జిన్‌ టీకాను ఐఎల్‌ఆర్‌లో భద్రపరుస్తున్న వైద్య సిబ్బంది

- ఆసిఫాబాద్‌కు చేరుకున్న కొవాగ్జిన్‌ టీకా

- జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటు

-  నేటి నుంచి తొలి విడతలో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 15: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కొవిడ్‌ టీకా వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. వ్యాక్సి నేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరా బాద్‌ నుంచి  కొవాగ్జిన్‌ టీకా గురువారం జిల్లా కేంద్రానికి చేరు కుంది. జిల్లాకు 28 వయల్స్‌ రాగా వాటిని ఐఎల్‌ఆర్‌ కేంద్రంలో భద్రపరిచారు.  ఈ మేరకు జిల్లాలో 4,012 మందికి తొలి విడతలో కొవాగ్జిన్‌ టీకా వేసేందుకు గుర్తించారు. 

అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కాగజ్‌నగర్‌లోని పీహెచ్‌సీ, సర్‌ సిల్క్‌లోని ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో కొవాగ్జిన్‌ టీకా అందించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకుగానూ ఆయా కేంద్రా లకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఆసిఫాబాద్‌లో ఆసిఫాబాద్‌ ఆర్డీవో సిడాం దత్తు, కాగజ్‌నగర్‌ పీహెచ్‌సీలో కాగజ్‌నగర్‌ ఆర్డీవో చిత్రు, సర్‌సిల్క్‌ ఆర్బన్‌ కేంద్రంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాంబాబు కొవాగ్జిన్‌ టీకా అందజేత ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.  

కరోనా వారియర్స్‌కు..

జిల్లాలో తొలి విడతలో కరోనా వారియర్స్‌కు కొవిడ్‌ నియంత్రణ వ్యాక్సిన్‌ వేయనున్నారు. అంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో పని చేసే వైద్య, ఆరోగ్య సిబ్బందికి ముందుగా టీకా వేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అస్పత్రులలో పని చేసే 1.234 మంది, ప్రైవేటు ఆస్పత్రులలో పనిచేసే 348 మంది, అంగన్‌వాడీలు 2,430 మందిని గుర్తించారు. ఈ మేరకు శనివారం ఒక్కో కేంద్రంలో 30 మందికి చొప్పున టీకా వేయను న్నారు. రెండో విడతలో పోలీసులు, సైనికులు, గ్రామపంచాయతీ, ముని సిపాలిటీ సిబ్బంది టీకా వేయనున్నారు. మూడో విడతలో 50 ఏళ్లు దాటిన వారికి, పలు రుగ్మతలతో బాధపడుతున్న వారికి టీకా వేయను న్నారు. అలాగే 18 ఏళ్లు నిండని వారికి, బాలింతలు, గర్భిణులకు టీకా వేయకూడదని నిర్ణయించారు.

 సిబ్బందికి శిక్షణ..

వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తయిం ది. జిల్లా అధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఉప వైద్యాధికారులు, సూపర్‌ వైజర్లతో పాటు క్షేత్ర స్థాయిలో పని చేసే వైద్యులు, సిబ్బంది, అంగన్‌వా డీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. వ్యాక్సినేషన్‌, కోల్డ్‌చైన్‌ ఎలా అన్నదానిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. 

ఏర్పాట్లు పూర్తి..

- కుమరం బాలు, డీఎంహెచ్‌వో

కొవిడ్‌ నివారణ వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి జిల్లాలో ఏ ర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే ఆర్హులైన వారి జాబితా రూపొందించాం. కొవా గ్జిన్‌ టీకా గురువారం జిల్లా కేంద్రానికి చేరుకుంది.  ఎంపిక చేసిన కేం ద్రాలకు తరలించాం. ప్రస్తుతం జిల్లాకు 28 వయల్స్‌ వచ్చాయి. 

Updated Date - 2021-01-16T04:21:43+05:30 IST