BJP Yuva Morcha Praveen Nettaru murder: కర్ణాటకలో ఇక యోగి మోడల్

ABN , First Publish Date - 2022-07-29T03:04:35+05:30 IST

బెంగళూరు: బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు(32) దారుణ హత్యపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై స్పందించారు.

BJP Yuva Morcha Praveen Nettaru murder: కర్ణాటకలో ఇక యోగి మోడల్

బెంగళూరు: బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు (BJP Yuva Morcha worker Praveen Nettaru) దారుణ హత్యపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai) స్పందించారు. బాధ్యులను వదలబోమని, కఠిన చర్యలు తీసుకుంటామమని ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ప్రవీణ్ హత్యకు కారణమైన సంస్థలనూ వదిలేది లేదన్నారు. అవసరమైతే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అవలంభిస్తున్న విధానం (Yogi model) తాము కూడా అమలు చేస్తామన్నారు. యూపీలో అల్లర్లకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం యోగి సర్కారు విధానం. పరిస్థితులను బట్టి అదే విధానాన్ని తాము కూడా అమలు చేస్తామని బొమ్మై చెప్పారు.






కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బెళ్లారెలో చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్న ప్రవీణ్‌ మంగళవారం రాత్రి షాపు మూసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు తల్వార్లతో ఆయనపై దాడి చేసి హత్య చేశారు. 


ప్రవీణ్‌ నెట్టారు హత్య పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పనేనని, ఆ సంస్థను నిషేధించాలంటూ తాము కేంద్రానికి నివేదిస్తామని బొమ్మై చెప్పారు. 



Updated Date - 2022-07-29T03:04:35+05:30 IST