గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన థావర్‌చంద్ గెహ్లాట్
ABN , First Publish Date - 2021-07-10T18:22:54+05:30 IST
కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత థావర్‌చంద్ గెహ్లాట్ ఆదివారం బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు సాగుతున్నాయి. కర్ణాట
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత థావర్‌చంద్ గెహ్లాట్ ఆదివారం బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు సాగుతున్నాయి. కర్ణాటక 19వ గవర్నర్‌గా గెహ్లాట్ బాధ్యతలు చేపడతారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభయ్ శ్రీనివాస్ ఓకా గవర్నర్‌గా గెహ్లాట్‌చేత ప్రమాణం చేయిస్తారు. 1948 మే 18న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించిన గెహ్లాట్ బీజేపీలో ఎన్నో కీలక పదవులలో కొనసాగారు. ప్రస్తుతం ఆయన వయస్సు 73 ఏళ్లు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్‌లో సామాజిక న్యాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తుండగానే గవర్నర్‌గా నియమితులయ్యారు. రెండురోజుల కిందట మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం గవర్నర్‌గా వ్యవహరిస్తున్న వాజుభాయ్‌వాలా 6 సంవత్సరాల 10 నెలల పాటు ఉన్నారు. ఐదేళ్ల వ్యవధి ముగిశాక 22 నెలల పాటు గవర్నర్‌గా కొనసాగారు.
కొత్త గవర్నర్ గెహ్లాట్ తొలిసారి రాజ్‌భవన్‌కు వస్తుండటంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గెహ్లాట్‌ను స్వా గతించేందుకు ప్రభత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శనివారం రాత్రికే కుటుంబికులతో కలిసి గెహ్లాట్ బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది.