హిజాబ్ వివాదం: విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం.. సీనియర్ల సంగతి తర్వాత!

ABN , First Publish Date - 2022-02-11T01:48:22+05:30 IST

కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను దశల వారీగా తిరిగి తెరవాలని

హిజాబ్ వివాదం: విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం.. సీనియర్ల సంగతి తర్వాత!

బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను దశల వారీగా తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో సోమవారం (14వ తేదీ) నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను అనుమతిస్తారు. ఆ పై తరగతులకు సంబంధించి మాత్రం తర్వాత నిర్ణయం తీసుకుంటారు.


ముఖ్యమంత్రి బొమ్మై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ విషయమై మంత్రులతో సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, పోలీసు అధికారులు కూడా హాజరవుతారు. కాగా, కళాశాల విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది. స్కూళ్లు తెరుచుకోవచ్చని, కాకపోతే సమస్య కోర్టులో పెండింగులో ఉన్నంత వరకు విద్యార్థులు మతపరమైన ఎలాంటి దుస్తులు ధరించరాదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.    

Updated Date - 2022-02-11T01:48:22+05:30 IST