ఆ మంత్రి సదా వివాదాల్లోనే...

ABN , First Publish Date - 2022-04-15T17:10:55+05:30 IST

మంత్రి ఈశ్వరప్పకు వివాదాలకు అవినాభావ సంబంధం ఉందంటే అతిశయోక్తి కాదు. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పెను సంచలనాలు సృష్టించే ఈశ్వరప్ప చివరకు కాంట్రాక్టర్‌

ఆ మంత్రి సదా వివాదాల్లోనే...

బెంగళూరు: మంత్రి ఈశ్వరప్పకు వివాదాలకు అవినాభావ సంబంధం ఉందంటే అతిశయోక్తి కాదు. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పెను సంచలనాలు సృష్టించే ఈశ్వరప్ప చివరకు కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య ఘటనతో మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తోంది. 2021 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్ప తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారంటూ గవర్నర్‌కు వినతిప త్రం అందజేసి, హైకమాండ్‌కు లేఖ రాయడం ద్వారా ఈశ్వరప్ప పెను వివాదం సృష్టించారు. కేబినెట్‌ మంత్రిగా ఉంటూనే ఏకంగా ముఖ్యమంత్రినే వివాదంలోకి లాగిన ఘనతను దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ నేతలపై అయితే ఈశ్వరప్ప వాడిన పదజాలం చాలా సందర్భాలలో దుమారం రే పింది. ఫిబ్రవరి 22న శివమొగ్గలో భజరంగ్‌దళ్‌ కార్యకర్త హర్ష అంతిమయాత్ర వేళ 144వ సెక్షన్‌ను ఉల్లంఘించిన మంత్రిగా వివాదంలో ఇరుక్కున్నారు. శాసనసభలోనూ దీ నిపై భారీ రగడ జరిగింది. ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయపతాకం బదులు భగవత్‌ ధ్వజం ఎగురవేసే రోజులు త్వరలోనే ఉంటాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆక్షేపించడం గమనార్హం. బీజేపీలో ఇలా వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న ఈశ్వరప్ప అనివార్య పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Updated Date - 2022-04-15T17:10:55+05:30 IST