Abn logo
Jul 1 2020 @ 06:05AM

ప్రభుత్వ మద్యం షాపులో కర్ణాటక లిక్కర్‌ అమ్మకాలు!

దుకాణం సేల్స్‌మన్‌ అరెస్టు


కలికిరి, జూన్‌ 30: కలికిరిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏకంగా కర్ణాటక లిక్కర్‌ అమ్ముతూ ఓ సేల్స్‌మన్‌ ఎస్‌ఈబీ అధికారులకు పట్టుబడ్డాడు. కలికిరిలో మూడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఒకే భవనంలో ఏర్పాటయ్యాయి. ఈ దుకాణాల్లో సోమవారం రాత్రి ఎస్‌ఈబీ సీఐ యల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులోని ఒక దుకాణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓల్ట్‌ అడ్మిరల్‌ బ్రాండు మద్యం విక్రయించడం గుర్తించి మొత్తం ఏడు లీటరు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మీడియం బ్రాండు మద్యాన్ని సీసా రూ. 1100 వంతున అమ్ముతున్నట్లు సీఐ చెప్పారు. మద్యాన్ని అక్రమంగా కర్ణాటక నుంచి తెచ్చి అమ్ముతున్న షాపు సేల్స్‌మన్‌ గండబోయనపల్లెకు చెందిన షేక్‌ షఫీవుల్లాను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement