కర్ణాటక దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-05-22T06:24:53+05:30 IST

అంతర్రాష్ట్ర దొంగల ము ఠాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రూ. 12.5లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నా రు. రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్న ఇళ్లను ఎంచుకుని ఈ ముఠా చోరీలకు పాల్పడుతుంటుంది.

కర్ణాటక దొంగల ముఠా అరెస్టు
మాట్లాడుతున్న ఎస్పీ మలికగర్గ్‌

ఐదుగురిని పట్టుకున్న పోలీసులు  

రూ.12.5 లక్షల సొత్తు స్వాధీనం 

సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టివేత 

వివరాలు వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్‌


ఒంగోలు(క్రైం), మే 21 : అంతర్రాష్ట్ర దొంగల ము ఠాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రూ. 12.5లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నా రు. రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్న ఇళ్లను ఎంచుకుని ఈ ముఠా చోరీలకు పాల్పడుతుంటుంది. కర్ణాటకకు చెందిన దొంగల ముఠా ఒంగోలులో మూడు దొంగత నాలు చేసింది. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్పీ మలిక గర్గ్‌ స్థానిక గెలాక్సీభవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వివరా లు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం, దావణగెరె జిల్లా నా గరకట్టేకు చెందిన ఎం.పురుషోత్తం, ఏ.సచిన్‌, జీవన్‌, ఎన్‌బీ అజయ్‌, ఎస్‌.పునీత్‌లు ముఠాగా ఏర్పడి చోరీల కు పాల్పడుతున్నారు. వీరిని ఒంగోలు టూటౌన్‌ పోలీ సులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద రూ. 12.5లక్షలు విలువగల 272 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శుక్రవారం సా యంత్రం ఒంగోలు రైల్వేస్టేషన్‌లో అనుమానంగా ఉ న్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద ఉన్న బంగారాన్ని పరిశీలించగా ఒంగోలు రైల్వే స్టేషన్‌ సమీపంలో గల తాళం వేసి ఇళ్లలో చోరీ అయి న సొత్తుగా నిర్ధారణ అయింది. ఈమేరకు వారిని అ దుపులోకి తీసుకొని అరెస్టు చేశామన్నారు.


నిందితులు నేరచరిత్ర ఇది


పురుషోత్తం ఆంధ్రా, కర్ణాటకలో ఏడు కేసుల్లో నిం దితుడు. అందులో ఒక హత్య కేసు కూడా ఉంది. సచి న్‌ రెండు రాష్ట్రాల్లో పది దొంగతనం కేసుల్లో నిందితు డు. జీవన్‌పై ఒంగోలు, ఏలూరు, చిత్రదుర్గల్లో నాలు గు దొంగతనం కేసులు ఉన్నాయి. అజయ్‌, పునీత్‌లపై మూడు దొంగతనం కేసులు ఉన్నాయి. ఒంగోలులో అగ్రహారం గేటు, ఇందుర్తినగర్‌, ఏలూరులో జరిగిన దొంగతనంలో నిందితుని వద్ద సొత్తు రికవరీ పో లీసులు చేశారు.


దొంగలను పట్టించిన సీసీ ఫుటేజీ


అగ్రహారం గేటు సమీపంలో గత నెలలో జరిగిన చోరీ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రైల్వేస్టేష న్‌లో దొరికిన సీసీ ఫుటేజీ దొంగల ముఠాను పట్టిం చింది. దొంగతనం జరిగిన రోజు రికార్డును పరిశీలి స్తున్న పోలీసులకు దొంగతనం జరిగిన ఇంట్లో బ్యాగ్‌ తీసుకెళుతున్న వ్వక్తిని గుర్తించారు. దీంతో అక్కడ నుంచి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పూర్తి దర్యాప్తు చే శారు. అనంతరం దొంగల ముఠాను పట్టుకున్నారు.


పోలీసులకు రివార్డులు 


ఈకేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినం దించి రివార్డులు అందజేశారు. రివార్డులు తీసుకున్న వారిలో డీఎస్పీ యు.నాగరాజు, టూటౌన్‌ సీఐ ఎస్‌.రాఘవ రావు, ఏఎస్‌ ఐబాలాంజనేయులు, హెడ్‌కానిస్టేబుళ్లు జి.అంజ మ్మరావు, డి.నరసయ్య, కానిస్టేబుళ్ళు అంజిబాబు, చాంద్‌బా షా, కిషోర్‌, లక్షీకాంతరావు, అవినాష్‌, సురేష్‌, హోంగార్డు చి రంజీవి, మాధవరావు ఉన్నారు.


Updated Date - 2022-05-22T06:24:53+05:30 IST