కరోనా టీకాల్లో కావాల్సింది ఎంచుకునే స్వేఛ్చ మాకు ఉండాలి: కర్ణాటక డాక్టర్లు

ABN , First Publish Date - 2021-01-19T23:42:02+05:30 IST

కావాల్సిన టీకాను ఎంచుకునే స్వేఛ్చ ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం కల్పించాలని కర్ణాటక రెసిడెంట్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి మంగళవారం నాడు ఓ లేఖ రాసింది.

కరోనా టీకాల్లో కావాల్సింది ఎంచుకునే స్వేఛ్చ మాకు ఉండాలి: కర్ణాటక డాక్టర్లు

బెంగళూరు: కావాల్సిన టీకాను ఎంచుకునే స్వేఛ్చ ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం కల్పించాలని కర్ణాటక రెసిడెంట్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి మంగళవారం నాడు ఓ లేఖ రాసింది. కోవ్యాక్సిన్ తీసుకునే క్రమంలో రెసిడెంట్ డాక్టర్లు ఓ డిక్లెరేషన్ ఇవ్వాల్సి రావాడాన్ని డాక్టర్ల సంఘం తన లేఖలో ప్రస్తావించింది. ఈ డిక్లరేషన్‌లో..‘కోవ్యాక్సిన్ ప్రభావశీలత ఎంతనేది ఇంకా నిర్ధారణ కాలేదు’ అని ఉన్నట్టు వైద్యుల సంఘం పేర్కొంది.  ఈ పరిణామంపై అక్కడి రెసిడెంట్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సిన టీకాను ఎంచుకునే స్వేఛ్చ తమకు ఉండాలిన వారు తేల్చి చెప్పారు. కర్ణాటకలో కొన్ని జిల్లాల్లో ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవీషీల్డ్ ఇస్తుండగా మరికొన్ని చోట్ల భారత్ బయోటెక్ రూపొందించిన కొవ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ వైఖరి వివక్షా పూరితమని రెసిడెంట్ డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. తాము తీసుకోబోయే టీకాను ఎంచుకునే స్వేచ్ఛ  తమకు ఉండాలని వారు తేల్చి చెప్పారు. 

Updated Date - 2021-01-19T23:42:02+05:30 IST