కర్ణాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-08-03T10:22:23+05:30 IST

కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి డీసీఎం లారీలో మద్యాన్ని బేతంచెర్లకు తీసుకొస్తుండగా పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక మద్యం పట్టివేత

బేతంచెర్ల, ఆగస్టు 2: కర్ణాటక రాష్ట్రం  బళ్లారి నుంచి డీసీఎం లారీలో  మద్యాన్ని బేతంచెర్లకు  తీసుకొస్తుండగా పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు.   సీఐ కేశవరెడ్డి, ఎస్‌ఐ సురేష్‌ తమ సిబ్బందితో రంగాపురం రైల్వే గేటు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురిని   అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.3 లక్షల  విలువైన కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.


బేతంచెర్ల పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ బేతంచెర్ల పట్టణానికి చెందిన డీసీఎం యజమాని గురుమూర్తి తన డీసీఎం లారీలో బేతంచెర్ల నుంచి బళ్లారికి నాపరాళ్లు రవాణా చేస్తున్నాడని,  అదే లారీలో నాపరాళ్ల డిపో యజమాని కళింగిరి రవి బేతంచెర్లకు కర్ణాటక మద్యాన్ని  సరఫరా చేస్తున్నాడని తెలిపారు.  ఈ లారీలో రామగోపాల్‌, గఫూర్‌, షేక్షావలి, మాబాషా  బేతంచెర్లకు ఆఫీసర్స్‌ ఛాయిస్‌ 18 కేసులు, 8పీఎమ్‌ 7 కేసులు, 1225 క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.  నిందితులను అరెస్టు చేసి డీసీఎంను సీజ్‌ చేసినట్లు తెలిపారు.  శేఖర్‌, రవి అనే ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ ఐదుగురిపై  కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-03T10:22:23+05:30 IST