హిజాబ్ వివాదం నేపథ్యంలో పటిష్ట భద్రత మధ్య కర్ణాటకలో ప్రీ-యూనివర్సిటీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-04-22T20:36:27+05:30 IST

న్యూఢిల్లీ : హిజాబ్ వివాదం నేపథ్యంలో పటిష్ట భద్రత నడుమ కర్ణాటకలో ప్రీ-యూనివర్సిటీ పరీక్షలు శుక్రవారం నుంచి మొదలయ్యాయి.

హిజాబ్ వివాదం నేపథ్యంలో పటిష్ట భద్రత మధ్య కర్ణాటకలో ప్రీ-యూనివర్సిటీ పరీక్షలు

బెంగళూరు : హిజాబ్ వివాదం నేపథ్యంలో పటిష్ట భద్రత నడుమ కర్ణాటకలో ప్రీ-యూనివర్సిటీ పరీక్షలు శుక్రవారం నుంచి మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1076 పరీక్షా కేంద్రాలలో 6.84 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మే 18తో ఎగ్జామ్స్ ముగియనున్నాయి. స్కూళ్లు, కాలేజీల్లో  హిజాబ్ లేదా ఏదైనా మతంతో ముడిపడివున్న వస్త్రం(క్లాత్‌) ధరించడంపై కోర్ట్ నిషేధం ఉన్న నేపథ్యంలో ముస్లీం బాలికలు తమ హిజాబ్‌లను తొలగించి ఎగ్జామ్ హాల్‌లోకి ప్రవేశించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లీం విద్యార్థినులు ప్రత్యేక ఏర్పాట్ల వద్ద తమ హిజాబ్‌లను తొలగించాల్సి ఉంటుంది. పరీక్ష పూర్తయిన తర్వాత తిరిగి తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. 


పరీక్షల నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ ముస్లీం బాలిక స్పందిస్తూ.. హిజాబ్ ముఖ్యమైనది. అదేవిధంగా పరీక్షలు రాసి పాసవ్వడం అంతే ముఖ్యమని పేర్కొంది. పరీక్షలపై తమ భవిష్యత్ ఆధారపడి ఉందని వెల్లడించింది. కాగా స్కూల్స్, కాలేజీల్లో సమానత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తోందన్న కారణంతో హిజాబ్‌పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక హైకోర్ట్ సమర్థించిన విషయం విధితమే.

Updated Date - 2022-04-22T20:36:27+05:30 IST