కరీంనగర్ జిల్లా: కొత్తపల్లి మండలం, చింతకుంట దగ్గర సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్ వాహనం-కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు మహబూబాబాద్, ములుగు జిల్లాల వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో టాటాఏస్‌లో 15 మంది, కారులో ఐదుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.