MLA ఫోటోకు Comments చేసిన యువకుడిని చితకబాదిన పోలీసులు

ABN , First Publish Date - 2022-06-25T21:01:49+05:30 IST

ఎమ్మెల్యే ఫోటోకు అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు చితకబాదారు.

MLA ఫోటోకు Comments చేసిన యువకుడిని చితకబాదిన పోలీసులు

Karimnagar జిల్లా: వాట్సాప్ (WhatsApp) గ్రూపులో ఎమ్మెల్యే (MLA) ఫోటోకు అనుచిత వ్యాఖ్యలు (Comments) చేసిన యువకుడిని కరీంనగర్ జిల్లా, చొప్పదండి పోలీసులు చితకబాదారు. లాఠీలతో ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు వాపోయాడు. చొప్పదండి నియోజకవర్గం వాట్సాప్ గ్రూపులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇతర నాయకులు భోజనం చేస్తున్న ఫోటోకు పవన్ కుమార్ అనే యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్టు పెట్టాడంటూ పవన్‌పై పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని దాంతో తాను నడవలేకపోతున్నానని బాధితుడు వాపోయాడు. మరోవైపు వాట్సాప్‌లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినట్లు ఆ యువకుడు అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2022-06-25T21:01:49+05:30 IST