కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, కన్న కూతరునే పొట్టనపెట్టుకున్నాడు ఓ కసాయి భర్త. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇనుప రాడ్‌తో భార్య, కూతురును బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.