ఖరీఫ్‌కు సిద్ధం కండి

ABN , First Publish Date - 2022-05-25T06:17:26+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నామని, జూన్‌ 1నుంచి కాలువలు నీరు వదలనుండడంతో రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందివ్వడానికి సమాయత్తమవుతున్నామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు తెలిపారు.

ఖరీఫ్‌కు సిద్ధం కండి
వ్యవసాయాధికారి మధుసూదనరావు

పంపిణీకి 8,200 క్వింటాళ్ల వరి విత్తనాలు

వ్యవసాయాధికారి మధుసూదనరావు


రాజమహేంద్రవరం, మే 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నామని, జూన్‌ 1నుంచి కాలువలు నీరు వదలనుండడంతో  రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందివ్వడానికి  సమాయత్తమవుతున్నామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఖరీఫ్‌ పంటకు 367 ఆర్బీకేల ద్వారా 8,200 క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 59వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా, ఇందులో 90శాతం  రైతులే సొంత విత్తనాలు వినియోగించుకుంటారని చెప్పారు. రైతాంగానికి కావలసిన ఎరువులు, పురుగుమందులు ఇప్పటికే  11వేల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ సిద్ధం చేశామన్నారు. జూన్‌ నెలలో పంట వేయడం వల్ల అక్టోబరు మాసంలో  కోతకు వస్తుందన్నారు. దాని వల్ల నవంబరు నెలలో వచ్చే తుఫాన్‌, వరదల నుంచి రైతాంగం నష్టపోకుండా  పంటను కాపాడుకోవచ్చన్నారు. రెండో పంటకు డిసెంబరులోనే నాట్లు వేసుకుని, ఏప్రిల్‌, మే నెలలో   వచ్చే తుఫాన్‌ బారి నుంచి కాపాడుకోవచ్చన్నారు.ఈ మధ్యలో మూడో పంటగా మినుము, పెసర,ఇతర పచ్చిరొట్ట పంటలను వేసుకోవచ్చని తెలిపారు.  


Updated Date - 2022-05-25T06:17:26+05:30 IST