జెండాతో కపిరాజు

ABN , First Publish Date - 2022-08-14T04:28:50+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా దేశమంతా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటోంది.

జెండాతో కపిరాజు

వాల్మీకీపురం, ఆగస్టు 13 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా దేశమంతా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటోంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేసి జాతీయభావాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వాల్మీకీపురం టౌన్‌లోని జెట్టిపాలెం వీధిలోని ఓ నివాసంపై ఉన్న జాతీయ జెండా వద్ద ఓ వానరం కూర్చుని నేను సైతం దేశసేవలో అన్నట్లు జెండాను పట్టుకుని ఊపుతూ కనిపించింది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. 

Updated Date - 2022-08-14T04:28:50+05:30 IST