సీఎఫ్‌ఎంఎస్‌లో డీఆర్‌ ఉన్నట్లు కనికట్టు

ABN , First Publish Date - 2022-08-11T05:19:03+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది పెన్షనర్లున్నారు. వీరిలో రూ. 20 వేల నుంచి రూ. లక్షకుపైగా పెన్షన తీసుకునే వారున్నారు.

సీఎఫ్‌ఎంఎస్‌లో డీఆర్‌ ఉన్నట్లు కనికట్టు

చేతికందిందిశూన్యం

నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే...

ఇబ్బంది పడుతున్న పెన్షనర్లు


రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత జీవితంలోనూ ప్రశాంతత లేకుండా చేస్తోందని పలువురు పెన్షనర్లు వాపోతున్నారు. వృద్ధులైన తమకు మేలు చేసే పనులు చేయాల్సిందిపోయి ఉన్న వాటిని ఎత్తేసి ఇవ్వాల్సిన పెన్షన బకాయిలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకూ డీఆర్‌ (డియర్‌నెస్‌ అలవెన్స) విషయంలో మాయచేసి పెన్షనర్లను ఇబ్బంది పెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


అనంతపురం ప్రెస్‌క్లబ్‌ ఆగస్టు 10 :  జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది పెన్షనర్లున్నారు. వీరిలో రూ. 20 వేల నుంచి రూ. లక్షకుపైగా పెన్షన తీసుకునే వారున్నారు. వీరందరికి 1-7-2018 నుంచి డీఆర్‌లు రావాల్సి ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు 11వ పీఆర్సీ, సీపీఎస్‌ రద్దును కోరుతూ రోడ్డెక్కిన విష యం తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. అందులో మెరుగైన డీఆర్‌లను బకాయిలతో కలిపి ఇస్తామని ప్రకటించింది. దీంతో పెన్షనర్లందరూ డీఆర్‌లన్నీ వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. మొత్తం డీఆర్‌లు ఇస్తున్నట్లు సీఎ్‌ఫఎంఎ్‌సలో బదలాయింపు చేసింది. అయితే ఇంత వరకూ పెన్షనర్లకు ఒక్క డీఆర్‌ అందలేదు. ప్రభుత్వం మాయచేసి చూపులకు మాత్రమే సీఎ్‌ఫఎంఎ్‌సలో ఉన్నట్లు చూపించి మోసం చేసిందని ఆ వర్గాలు మండిపడుతున్నాయి.  


ఒకటో తేదీ పెన్షన అందడమూ ఆలస్యమే...

పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీ బ్యాంకు అకౌంట్లలో పెన్షన పడాల్సిన ఉంది. అయితే  గత ఐదారు నెలలుగా 10వ తేదీ అయినా పెన్షనలు వారి ఖాతాలకు జమ కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పెన్షన మీదే ఆధారపడి జీవిస్తున్న వృద్ధుల పరిస్థితి దారుణంగా తయారైంది. 


ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.. - పెద్దనగౌడ్‌, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

      నా సర్వీసులో ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. పెన్షనలు, అలవెన్సుల్లో కోత విధించి మమ్మల్ని  ఇబ్బంది పెడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు సంక్షేమ పథకాలు అందివ్వాల్సిందిపోయి... ఉన్న వాటిని ఎత్తేసింది. డీఆర్‌ బకాయిలను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. పెన్షనర్ల ఉసురు ప్రభుత్వానికి తగలక తప్పదు.




సీఎఫ్‌ఎంఎస్‌లో ఉంటే మాకెప్పుడు అందేది? - రామకృష్ణ, పెన్షనర్‌

డీఆర్‌లు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. చెప్పిన మేరకు సీఎఫ్‌ఎంఎస్‌లో యాడ్‌ చేశారు. కానీ ఇంత వరకూ ఆ సీఎఫ్‌ఎంఎస్‌ లో ఉన్న ఒక్క డీఆర్‌ కూడా మా ఖాతాలకు జమకాలేదు. నాకు దాదాపుగా 50 వేలకుపైగా డీఆర్‌ మొత్తం రావాలి. ఇంత వరకూ రాలేదు... మరి జీవోలో పొందుపరిచిన మేరకు పెంచిన డీఆర్‌ను ఎప్పుడిస్తారో ఏమో అర్థం కావడం లేదు. 

Updated Date - 2022-08-11T05:19:03+05:30 IST