మాజీ ఎమ్మెల్యే కందుల ఆకస్మిక మృతి

ABN , First Publish Date - 2020-11-05T17:29:31+05:30 IST

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కందుల శివానందరెడ్డి..

మాజీ ఎమ్మెల్యే కందుల ఆకస్మిక మృతి

టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు

పలువురు ప్రముఖుల నివాళి


కడప: మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కందుల శివానందరెడ్డి (71) బుధవారం తెల్లవారుజామున కడపలో గుండెపోటుతో మృతి చెందారు. ఈయన రాజకీయ పదవులతో పాటు పారిశ్రామికవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా మరింత గుర్తింపు పొందారు. ఆయనకు భార్య రాజేశ్వరమ్మ, తనయుడు కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, సోదరుడు కందుల రాజమోహన్‌రెడ్డి, ముగ్గు రు సోదరీమణులు ఉన్నారు. బావ రామమునిరెడ్డి గతంలో ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.


సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం

1949 ఏప్రిల్‌ 15న కందుల శివానందరెడ్డి జన్మిం చారు. ఈయన తండ్రి ఓబుల్‌రెడ్డి కూడా రాజకీ య నేత. తండ్రి మరణానంతరం జిల్లాలో తమ వర్గాన్ని శివానందరెడ్డి నడిపిస్తూ వచ్చారు. ఆయన 1981లో శాసనమండలి సభ్యునిగా ఎంపికయ్యారు. 1989లో కడప ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1996లో తన సోదరుడు కందుల రాజమోహన్‌రెడ్డితో కలిసి టీడీపీలో చేరా రు. అప్పట్లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై రాజమోహన్‌రెడ్డి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అనంతరం శివానందరెడ్డి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యునిగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగా కొద్దికాలం వైసీపీలో ఉన్నారు.


పారిశ్రామికవేత్త, విద్యా సంస్థల అధినేతగా..

ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూనే మరో వైపు పారిశ్రామికవేత్తగా, కెఎ్‌సఆర్‌ఎం, కేవోఆర్‌ఎం, కేఎల్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాలల ను, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యాసంస్థల అధినేతగా రాణించారు. ఇంజనీరింగ్‌ కళాశాలల స్థాపనలో ఆయన జిల్లాకు మార్గదర్శిగా పేరొందారు.


ప్రముఖుల నివాళి

కందుల శివానందరెడ్డి మృతి చెందారన్న సమాచారంతో పలువురు రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు ఆయన నివాసగృహం చేరుకు భౌతిక కా యాన్ని సందర్శించి నివాళి అర్పించారు. నివాళి అర్పించిన వారిలో కమలాపురం ఎ మ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు రమే్‌షరెడ్డి, వీరశివారెడ్డి, లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు వెంకటశివారెడ్డి, చెంగల్రాయుడు, పీసీ సీ వర్కింగ్‌ ప్రెసిడెంటు ఎన్‌.తులసిరెడ్డి, టీడీపీ నే తలు బి.హరిప్రసాద్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గో వర్ధన్‌రెడ్డి, అమీర్‌బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె. యల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీ చలమారె డ్డి, నివాళి అర్పించారు. వైసీపీ నేతలు సురే్‌షబా బు, అహ్మద్‌బాషా, మాజీ డిప్యూటీ మేయరు ఆరిఫుల్లా, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రామకోటిరెడ్డి, కాంగ్రెస్‌ నేత నజీర్‌ అహ్మద్‌ తదితరులు నివాళులర్పించారు. మధ్యాహ్నం ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో శివానందరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. 


కందుల తనయుడికి సీఎం పరామర్శ..!

కందుల శివానందరెడ్డి తనయుడు కందుల చంద్ర ఓబుల్‌రెడ్డితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. కందుల కుటుంబంతో వైఎస్‌ కుటుంబానికి ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఇ టువంటి కష్టసమయంలోనే నిబ్బరంతో ముందుకు పోవాలని సూచించారు. అలాగే కందుల శివానం దరెడ్డి సేవలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేత సి.రామచంద్రయ్య వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు.


Updated Date - 2020-11-05T17:29:31+05:30 IST