Abn logo
May 6 2021 @ 21:38PM

కంటైన్మెంట్‌ జోన్‌గా కమ్మవారిపల్లి

సైదాపురం, మే 6: మండల పరిధిలోని కమ్మవారిపల్లిలో అధికారులు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నందున కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. ఈ గ్రామం నుంచి ఎవరూ బయటకు రాకూడదన్నారు. వలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వాణిరెడ్డి, డాక్టర్‌ షైనీ, ఎస్‌ఐ శివశంకర్‌ రావు, ఆర్‌ఐ వేణు, వీఆర్వో రమణయ్య పాల్గొన్నారు.

Advertisement