25 సంవత్సరాల తర్వాత.. కంభం చెరువు తొణికిసలాడుతుండటంతో..

ABN , First Publish Date - 2020-10-18T18:17:56+05:30 IST

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదయిన కంభం చెరువు ఇటీవల కురిసిన వర్షాలతో నిండింది. 25 సంవత్సరాల తర్వాత చెరువు తొణికిసలాడుతుండటంతో..

25 సంవత్సరాల తర్వాత.. కంభం చెరువు తొణికిసలాడుతుండటంతో..

కంభం(ప్రకాశం): ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదయిన కంభం చెరువు ఇటీవల కురిసిన వర్షాలతో నిండింది. 25 సంవత్సరాల తర్వాత చెరువు తొణికిసలాడుతుండటంతో రైతులు, ప్రజల్లో ఆనందం వ్యక్తవుతోంది. ప్రస్తుతం 20 అడుగుల మేర నీరు చేరింది. ఇంకో అడుగు చేరితే అలుగుపారే అవకాశం ఉంది. 5వేల హెక్టార్ల విస్తీర్ణంలో కంభం చెరువు విస్తరించి ఉంది. ఇది 1917, 1948, 1949, 1950, 1956, 1963, 1966, 1975, 1983, 1996 సంవత్సరాలలో నిండింది.  25 సంవత్సరాల తరువాత మరోసారి ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. చెరువు కింద 10వేల ఎకరాలు అధికారికంగా, 7వేల ఎకరాలు అనధికారికంగా సాగు చేస్తున్నారు. ఈఏడాది వరి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. 

Updated Date - 2020-10-18T18:17:56+05:30 IST