కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. బిబిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బీఈడీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరుకానున్నారు.