ప్రభుత్వమే మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోంది

ABN , First Publish Date - 2020-10-30T10:38:24+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యం లో వానాకాలంలో మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు రూ.1,850 నిర్ణయిం చి కొనుగోలు చేస్తోందని కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

ప్రభుత్వమే మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోంది

 కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌


కామారెడ్డి, అక్టోబరు 29: తెలంగాణ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యం లో వానాకాలంలో మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు రూ.1,850 నిర్ణయిం చి కొనుగోలు చేస్తోందని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని జనహిత భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ మొక్కజొన్న సాగు చేసిన రైతుల వివరా లను రైతు సమగ్ర సమాచార సేకరణ పోర్టల్‌లో నమోదు చేయడం జరిగినందున, పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతులను వ్యవసాయ విస్త రణ అధికారులు, వీఆర్‌లు బృందంగా ఏర్పడి రైతులు పండించిన పంట లను, నిల్వ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే పను లను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.


ఇప్పటి వరకు ఎవరికి అమ్మకుండా నిల్వ చేసిన మొక్కజొ న్నకు మాత్రమే వ్యవసాయ విస్తరణ అధికారులు కూపన్‌లను అందజే స్తారని తెలిపారు. తేమ 14 శాతం మించకుండా ఉన్నటు వంటి వాటిని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, ఇతర పదార్థాలు రెండు శాతం పాక్షికంగా దెబ్బతిన్న గింజలు, 1.5 శాతం రంగుమారిన మొక్కజొ న్నలు, 4.5శాతం పూర్తిపక్వం కానివి, ఒక శాతం తెగుళ్లు పట్టినవి మించ కుండా ఉండాలన్నారు. రైతు సమగ్ర సమాచార సేకరణ పోర్టల్‌లో నమో దు చేసుకున్న రైతుల మొక్కజొన్నలు మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, వ్యవసాయ అధికారి సునీత, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T10:38:24+05:30 IST