పురపోరులో మా సత్తా చూపుతాం: Kamal

ABN , First Publish Date - 2022-01-30T13:15:20+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం సత్తా ఏమిటో చూపుతామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ శపథం చేశారు. శనివారం ఉదయం ఆయన అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేశారు.

పురపోరులో మా సత్తా చూపుతాం: Kamal

చెన్నై: మున్సిపల్‌ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం సత్తా ఏమిటో చూపుతామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ శపథం చేశారు. శనివారం ఉదయం ఆయన అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేశారు. నగరంలోని ఏడు వార్డుల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో సుస్థిర పాలన, రాష్ట్రంలో స్వయం పరిపాలన, నగరాలు, గ్రామాల్లో సుపరిపాలన అనే లక్ష్యాలను కలిగిన తమ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నగరాన్ని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేయడమే తమ పార్టీ ఆశయమని, ఆ దిశగానే పార్టీ తరఫున నిజాయితీ పరులైన అభ్యర్థులను బరిలోకి దింపుతుందన్నారు. నగరంలో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా ఓట్లు పడ్డాయని, దీనిని బట్టి తమ పార్టీకి నగరాలు, పట్టణాల్లో మంచి పట్టు ఉందని రుజువైందని చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఈ ఎన్నికల్లో సైనికుల్లా అభ్యర్థుల విజయం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు 

Updated Date - 2022-01-30T13:15:20+05:30 IST