చంద్రగిరి, మార్చి 3: శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడి అలంకరణలో చిన్నశేష వాహనంపై,సరస్వతీ దేవి అలంకరణలో హంస వాహనంపై దర్శనమిచ్చారు. టీటీడీ డిప్యూటీ ఈవో ఽశాంతి, కంకణ భట్టర్ బాలాజీ రంగాచార్యులు, ఏఈవో ఽధనంజయుడు, అర్చకులు పార్థసారధి, శేషాద్రిచార్యులు, నారాయణచార్యులు, సూపరింటెండెంట్లు రమణయ్య, మునిచెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ యోగానందరెడ్డి పాల్గొన్నారు.