కాల్వలు ఇలా..సాగు ఎలా!

ABN , First Publish Date - 2022-06-30T06:03:53+05:30 IST

కాల్వలు ఇలా..సాగు ఎలా!

కాల్వలు ఇలా..సాగు ఎలా!
పుల్లేరులో పేరుకుపోయిన డెక్క, వ్యర్థాలు

 నీటి ప్రవాహానికి అడ్డుగా తూడు, డెక్క  

తుప్పు పట్టి పనిచేయని షట్టర్లు 

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

 ఆందోళనలో రైతన్నలు

ఉయ్యూరు, జూన్‌ 29 : కాల్వల్లో తూడు, గుర్రపు డెక్క వేసవిలో తొలగించకపోవటంతో నేడు నీటి ప్రవాహానికి అవి అడ్డుగా మారాయి.   చానల్‌ షట్టర్ల వద్ద తూడు, డెక్కతో పాటు వ్యర్థాలు పేరుకు పోవటంతో  షట్టర్లు వద్ద పెద్ద ఎత్తున పట్టేసి షట్టర్లు ఎత్తడానికి, దించడానికి ఆవరోధంగా మారాయి. ఈ నేపథ్యంలో సాగు నీరందేది ఎలా అని రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఉయ్యూరు మండల పరిధిలో పుల్లేరు, బ్రాంచి కాల్వలు తూడు, డెక్క ఇతర వ్యర్థాల తో పూడుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండ టంతో పొలాల సాగు ప్రశ్నార్ధకమవుతుందని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. పుల్లేరు కాల్వలో పెద ఓగిరాల, ఆకునూరు, చినఓగిరాల, గండిగుంట, ఉయ్యూరు  గ్రామాల పరిధిలో తూడు, గుర్రపుడెక్క, వ్యర్ధాలతో నిండిపోయి నీరు కన్పించనంతగా పేరుకు పోయాయి.  గండిగుంట, పరిసర గ్రామాల పొలాలకు నీరందించే బండారు కోడు కాల్వ పలుచోట్ల  లాకుల షట్టర్లు తుప్పుపట్టి పనిచేయపోవడంతో పంటకాల్వలకు  నీరు రావడం లేదు. పుల్లేరు నుంచి కపిళేశ్వరపురం చానల్‌  పొడవునా గుర్రపు డెక్కతో  నిండిపోయింది. బండారుకోడు, కపిళేశ్వరపురం చానల్‌ ద్వారా వందలాది  హెక్టార్లు సాగువుతుండగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో నీరు ఎంతవరకు వస్తుందో అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-30T06:03:53+05:30 IST