దోషులను కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2020-09-25T10:20:04+05:30 IST

రంగాపూర్‌ గ్రామ దళిత మహిళా సర్పంచ్‌ ఝాన్సీ ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

దోషులను కఠినంగా శిక్షించాలి

కల్వకుర్తి అర్బన్‌, సెప్టెంబరు 24: రంగాపూర్‌ గ్రామ దళిత మహిళా సర్పంచ్‌ ఝాన్సీ ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ, మల్లారెడ్డి, టీ జ్యోతి, రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌ డిమాండ్‌ చేశారు. వంగూరు మండలం రంగాపూర్‌ గ్రామ సర్పంచ్‌ ఝాన్సీ గ్రామాభివృద్ధి కోసం  పనులు చేపడుతుం టే అడ్డుపడుతూ ఇబ్బందులకు గురి చేసిన వా రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కల్వ కుర్తిలో గురువారం సీపీఎం, ప్రజా సంఘాల ఆ ధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మహిత హా స్పిటల్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, హాజ రయ్యారు.


కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సంద ర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ 30 గుంటల భూమిని ఆక్రమ ణ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆనంద్‌ రెడ్డి, నర్సింహ్మారెడ్డిలపై అట్రాసీటి కేసులు నమోదు చేయాలన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గ్రామ కార్యదర్శి, ఎస్‌ఐలపై ఒత్తిడి తెచ్చి గ్రామంలో గొడవలకు కారణం కావడం జరిగిందని ఆరోపించారు. ఫిర్యాదు చేసినా ఎస్‌ఐ బాలకృష్ణ పట్టించుకోలేద న్నారు. విధుల నుంచి ఎస్‌ఐని తొలగించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నా రు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఐద్వా జిల్లా కార్యదర్శి గీతా, నాయకులు దేశా నాయక్‌, మల్లేష్‌, శ్రీనివాసులు, బాల్‌రెడ్డి, శివరాములు, బాలస్వామి, ఆశోక్‌, లక్ష్మయ్య, పరుశరాములు, రమేష్‌, నాగరాజు, శివ వ ర్మ, శంకర్‌ నాయక్‌, సురేందర్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ రాజు పాల్గొన్నారు. 


సర్పంచ్‌లపై ఒత్తిడి తగ్గించాలి

 రంగాపూర్‌ సర్పంచ్‌ ఝాన్సీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కల్వకుర్తి పట్టణంలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సర్పంచ్‌ల సం ఘం రాష్ట్ర  అధ్యక్షుడు ఎల్‌ఎన్‌.రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌తో పాటు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఎముక జంగయ్య గురువారం ప రామర్శించారు. నోటీసుల పేరుతో సర్పంచ్‌లను భయాందోళనకు గురిచే స్తున్నారని అధికారులపై ఆరోపణ చేశారు. సర్పంచ్‌లపై ఒత్తిడి తగ్గించా లన్నారు. అలాగే వంగూరు జడ్పీటీసీ కెవిన్‌ రెడ్డి ఝాన్సీని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఝాన్సీని పరామర్శిం చిన వారిలో సర్పంచ్‌లు పాండు రంగారెడ్డి, నరేందర్‌ రెడ్డి, రమేష్‌ నాయ క్‌, పద్మ, అంజి యాదవ్‌, లింగారెడ్డి, పాండు గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిఽధి విజయ్‌ కుమార్‌ రెడ్డి, మాల మహానాడు జిల్లా కార్యదర్శి భగవంతు, ఉపాధ్యాక్షుడు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-09-25T10:20:04+05:30 IST