కల్కి అవతారoలోభద్రాద్రి రామయ్య

ABN , First Publish Date - 2022-01-21T05:57:06+05:30 IST

కల్కి అవతారoలోభద్రాద్రి రామయ్య

కల్కి అవతారoలోభద్రాద్రి రామయ్య
స్వామివారికి రాపత్తు సేవ

విశ్రాంతి మండపం వారి ఆధ్వర్యంలో రాపత్తు సేవ

వైభవంగా దొంగల దోపు ఉత్సవం

భద్రాచలం, జనవరి 20: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి గురువారం కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా చిత్రకూట మండపంలో విశ్రాంతి మండపం వారి ఆధ్వర్యంలో స్వామివారికి రాపత్తు సేవ నిర్వహించారు. ముందుగా స్వామివారిని అందంగా అలంకరించి మేళతాళాలు, భాజాభజంత్రీల మధ్య చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

అధ్యయనోత్సవాల్లో భాగంగా దొంగలదోపు

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న వైకుంఠ ఏకాదశి అఽధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్యకు గురువారం రాత్రి దొంగల దోపు ఉత్సవం రామాలయంలోని చిత్రకూట మం డపం ఎదురుగా నిర్వహించారు. తిరుమంగై ఆళ్వార్‌ చరిత్రకు సంబం ధించిన ఈ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సమయం లో పరకాలుడు వేషధారి శంఖు,చక్రాలు, గొడుగు చోరీ చేయగా వాటిని భటులు స్వాధీనం చేసుకొని స్వామివారి ముందు నిందితుడిని ప్రవేశపెడ తారు. ఈ సమయంలో నిందితుడు తప్పు ఒప్పుకొని స్వామివారిని క్షమిం చమని కోరతాడు. ఈ క్రమంలో పెరయ తిరుముడిలోని తొలి పది పాశురా లను అనుసంధానం చేసి పరకాలుడు వేషదారుడికి, భటులకు సన్మానం చేస్తారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వైదిక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:57:06+05:30 IST