కలిగిరికి జాతీయస్థాయి పురస్కారం

ABN , First Publish Date - 2022-04-16T03:50:40+05:30 IST

కలిగిరి పంచాయతీకి జాతీయస్థాయి పురస్కారం దక్కడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కలిగిరికి జాతీయస్థాయి పురస్కారం
కలిగిరి పంచాయతీలో పారిశుధ్య పనులు

కలిగిరి, ఏప్రిల్‌ 15: కలిగిరి పంచాయతీకి జాతీయస్థాయి పురస్కారం దక్కడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలిగిరి, జిర్రావారిపాలెం, పాపనముసిలిపాలెంలతో కలిసిన కలిగిరి పంచాయతీలో సుమారు 10వేలకు పైగా జనాభా ఉన్నారు. కలిగిరి పట్టణం కావలి-ఉదయగిరి-నెల్లూరు-కందుకూరు మార్గాల కూడలిగా ఉంది. నిత్యం  ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఫలసరుకులు, కూరాగాయల వ్యాపారులతోపాటు, రకరకాల పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించే చిరువ్యాపారులతో కలిగిరి పట్టణ కూడలి సందడిగా ఉంటుంది. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం కార్యదర్శిగా నియమితులైన వెలుగోటి మధు పంచాయతీలో పరిశుభ్రత, తాగునీటి సరఫరా, పారిశుధ్యం విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.   పట్టణ పరిశుభ్రతలో ఎక్కడా రాజీ పడలేదు. నిత్యం పంచాయతీ కార్మికులచే వీధుల శుభ్రత, చెత్త తరలింపు, కాలువల్లో పూడికతీత, దోమలనివారణ చర్యలు చేపట్టి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఆక్రమణలకు గురైన విలువైన పంచాయతీ స్థలాలను స్థానికులకు అద్దెకివ్వడం ద్వారా నెలకు లక్షలాది రూపాయాలను పంచాయతీక పన్ను రూపేణా ఆదాయం సమకూర్చుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 14న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన దీన్‌దయాళ్‌ పంచాయతీ శక్తికిరణ్‌ పురస్కారానికి శానిటేషన్‌ విభాగంలో కలిగిరి ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కేవీఎన్‌ చక్రధర్‌బాబు, డీపీవో ధనలక్మి పంచాయతీ కార్యదర్శికి, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నెల 24న కేంద్రం అందించే పురస్కారాన్ని పంచాయతీ సర్పంచు, కార్యదర్శి అందుకోనున్నాను. 




Updated Date - 2022-04-16T03:50:40+05:30 IST