ముందే ప్రణాళిక

ABN , First Publish Date - 2020-06-06T11:31:39+05:30 IST

ఎస్సారెస్పీ అధికారులు వానాకాలం సాగు ప్రణాళిక ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటిని వినియోగించడంతో పాటు

ముందే ప్రణాళిక

ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీటి విడుదలపై ముందుగానే ప్రణాళికను సిద్ధం చేస్తున్న అధికారులు

ఈనెల 16న హైదరాబాద్‌లో సమావేశం

ప్రస్తుతం జలాశయంలో నిల్వ ఉన్న 29 టీఎంసీల నీరు

అవసరం మేరకు కాళేశ్వరం నీటి తరలింపు

నీటి లభ్యతకు అనుగుణంగా ఆయకట్టుకు  నీటి తరలింపునకు నిర్ణయం


నిజామాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎస్సారెస్పీ అధికారులు వానాకాలం సాగు ప్రణాళిక ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటిని వినియోగించడంతో పాటు వచ్చే వర్షాల వల్ల ప్రాజెక్టుకు రాను న్న నీటి ఆధారంగా నీళ్లిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈ దఫా ముందుగానే ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 16న ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరందించే అంశంపైన సమావేశం నిర్వహిస్తున్నారు. అదే రోజు ఖరారు చేసి వానాకాలం సాగుకు నీళ్లందించే విధంగా ఏర్పాట్లు చే స్తున్నారు.


ఎస్సారెస్పీలో మొదటిసారి 29.722 టీఎంసీ ల నీళ్లున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి 5.8 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం గ తంలో ఎప్పుడూ లేనివిధంగా వినియోగానికి 29 టీఎం సీల నీళ్లుండడంతో ముందుగా సాగునీటిని ఆయకట్టు కు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మఽ ద్యనే సీఎం ఆధ్వర్యంలో  జరిగిన సమావేశంలో కూడా ఎస్సారెస్పీ నీటిపైన చర్చించారు. గతం కంటే ముందుగానే వానకాలం ఆయకట్టుకు సాగునీరును అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సారెస్పీతో పాటు దిగువన ఉన్న ఎల్‌ఎండీలో 7 టీ ఎంసీల నీళ్లున్నాయి. వీటిని వినియోగించుకునేందుకు నిర్ణయించారు. తాగునీటికి కొంత మేరకు నీటి నిల్వల ను ఉంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల ఆఽ దారంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 


వరద నీరే ప్రాజెక్టుకు ఆధారం..

ఎస్సారెస్పీకి ప్రతీ సంవత్సరం జూలై చివరి నుంచి ఆగస్టు చివరి వరకు ఎక్కువగా వరద వస్తుంది. ఆ నీ టి ద్వారానే ప్రాజెక్టు నిండుతుంది. కొన్ని సమయాల్లో మాత్రమే జూన్‌ నెలలో కొంత మేరకు వరద వస్తుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ పరిధిలో కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల పరిఽధిలో 9.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉం ది. దీంతో పాటు గుత్ప, అలీసాగర్‌ ఇతర ఎత్తిపోతల పథకాల కింద నిజామాబాద్‌, ని ర్మల్‌ జిల్లాల పరిధిలో రెండు న్నర లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తున్నా రు. ప్రస్తుతం ఉన్న నీ టితో ఎల్‌ఎండీ ఎగువ న నాలుగు తడుల వ రకు సాగునీరు అంది ంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వానాకాలం సాగుకు నీటి ని విడుదల చేయమంటే ఎల్‌ఎండీ ఎగువన ఉన్న ఆయకట్టుకు విడతల వారీగా సాగునీటిని అందించేందుకు సిద్ధమవుతున్నారు.


గోదావరికి వచ్చే వరద ఆధారంగా ఈనెలలోనే కాళేశ్వరం నీ టిని కూడా ఎస్సారెస్పీకి, ఎల్‌ఎండీకి తరలించాలని ఈ మధ్య జరిగిన సమావేశంలో సీఎం ఆదేశించినట్లు తెలిసింది. గత ఏడాది పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారె స్పీ వరకు నీటిని తీసుకొచ్చిన అధికారులు ఈ దఫా నీ టిని ఎత్తిపోసేందుకు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం ను ంచి వరద కాలువ వరకు నీటిని తీసుకొచ్చి పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ, ఎల్‌ ఎండీకి తరలించనున్నారు. నిత్యం ఈ రెండు ప్రాజెక్టులకు అర టీ ఎంసీ  చొప్పున నీటిని తరలి స్తారు. పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీకి 50 టీ ఎంసీల వరకు నీటిని తరలించే అవకాశం ఉండడం తో ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సారెస్పీ వ ద్ద ముప్కాల్‌ పంపులను అ న్ని మొదలుపెడితే మొత్తం ప్రాజెక్టును కూడా పునర్జీవన ప థకం ద్వారా కాళేశ్వరం నీటితో నిం పే అవకాశం ఉంది. ఎస్సారెస్పీకి మహారాష్ట్రలో పడే వర్షాల ద్వారా ప్రతీ సంవత్సరం వరద వ స్తుంది. ఈసారి కూడా భారీగానే వరద వస్తుందని అ ధికారులు భావిస్తున్నారు.


దాని ఆధారంగానే ప్రణాళిక ను సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వరద రాకున్నా కాళేశ్వ రం నీటితో పూర్తిగా ప్రాజెక్టును నింపి రెండు పంటల కు సాగునీరందించే విధంగా ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఎ స్సారెస్పీ ఆయకట్టుకు ఈ దఫా ముందుగానే సాగునీర ందే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రైతులు నారుమడులను కూడా సిద్ధం చేసే పనుల్లో ఉన్నారు.


16న హైదరాబాద్‌లో సమావేశం

ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదలపై ఈనెల 16న హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వానాకాలం సాగుకు నీళ్లందిం చే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాజెక్టు పరిధి లో ఎల్‌ఎండీకి ఎగువ, దిగువన ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారో నిర్ణయిస్తారు. ప్రభుత్వానికి నివేదిక పంపించి వానాకాలం సాగుకు నీరు అందించే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఎస్సారెస్పీ పరిధిలోని అధికారులు పాల్గొననున్నారు. 


గతంలో లేని విధంగా నీటి నిల్వలు.. ఎస్సారెస్పీ సీఈ శంకర్‌ 

ఎస్సారెస్పీ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నాయని ప్రాజెక్టు సీఈ శంకర్‌ తెలిపారు. ఈ వానాకాలంలో ముందుగానే సాగు నీటిని ఆయకట్టుకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈనెల 16న జరిగే సమావేశంలో పూర్తి నిర్ణయాలను ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటితో పా టు కాళేశ్వరం నుంచి కూడా నీటిని తరలిస్తామన్నా రు. ఎస్సారెస్పీకి మహారాష్ట్ర నుంచి వచ్చే వరదను అంచనా వేస్తూ కాళేశ్వరం నీటిని తరలిస్తామని ఆ యన తెలిపారు.


Updated Date - 2020-06-06T11:31:39+05:30 IST