కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-08-10T03:48:09+05:30 IST

కమీషన్ల కోసమే ముఖ్య మంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేప ట్టారని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేర్కొన్నారు. 75 సంవ త్సరాల స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కాం గ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాద్‌కీ గౌరవ పాదయాత్రను చేపట్టారు. జైపూర్‌, వెంకట్‌ రావుపల్లి, నర్వా, దుబ్బపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో నెలకొన్న సమస్యల ను తెలుసుకున్నారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే ఓదెలు

జైపూర్‌, ఆగస్టు 9: కమీషన్ల కోసమే ముఖ్య మంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేప ట్టారని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేర్కొన్నారు. 75 సంవ త్సరాల స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కాం గ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాద్‌కీ గౌరవ పాదయాత్రను చేపట్టారు. జైపూర్‌, వెంకట్‌ రావుపల్లి, నర్వా, దుబ్బపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో నెలకొన్న సమస్యల ను తెలుసుకున్నారు. పొలాల్లో మహిళా రైతులతో కలిసి వరినాట్లు వేశారు. వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో పంట నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. నిరవధిక దీక్ష చేస్తున్న వీఆర్‌ఏలకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్‌, శీలం వెంకటేశం పాల్గొన్నారు. 

బెల్లంపల్లి: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చడంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ పాత్ర పోషిం చిందని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖలు పేర్కొన్నారు. ఆజాదీ గౌర వ్‌ పాదయాత్రను కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 90 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని ఆరోపించారు.   నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తు న్న వీఆర్‌ఏలకు మద్దతు తెలిపారు. వీఆర్‌ఏలు 16 రోజులుగా దీక్షలు చేస్తున్నా సీఎం కేసీఆర్‌ పట్టిం చుకోవడం లేదన్నారు.  మాజీ మంత్రి గడ్డం వినోద్‌, నాయకులు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. 

మందమర్రి టౌన్‌: ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత కాంగ్రె స్‌కే దక్కిందని డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేం సాగర్‌రావు పేర్కొన్నారు. అజాదీకి గౌరవ్‌ పాద యాత్రను మందమర్రిలో చేపట్టారు. మోదీ ప్రభు త్వం రెండేండ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టిం దేమి లేదన్నారు. ప్రాణత్యాగాలు చేసిన త్యాగ మూర్తుల చరిత్రను తెలుసుకోవాలన్నారు. పాద యాత్ర ద్వారా దేశ ప్రజల ఐక్యతను చాటాలని, జాతీయ జెండాలను ఎగరవేయాలని పిలుపుని చ్చారు. రమేష్‌, ముజాహిద్‌, జీవన్‌ పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-08-10T03:48:09+05:30 IST