విజయనగరం: రైతులకు గిట్టుబాటు ధరేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు ప్రశ్నించారు. ఆంధ్రా అన్నపూర్ణ కోనసీమలో క్రాప్ హాలిడేకు వైసీపీ విధానాలే కారణమన్నారు. మద్దతు ధర రూ. 1400 ప్రకటనలకే పరిమితమయ్యిందని, రూ.900లను రైతుల చేతిలో పెట్టి మిల్లర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరల స్ధిరీకరణకు రూ. 3 వేల కోట్లు కేటాయిస్తామని జగన్ పాదయాత్రలో చేసిన ప్రకటనలు ప్రగల్బాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి