Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొవ్వూరు సర్పంచ్‌ అనుచిత వ్యాఖ్యలు

పాలకవర్గ సభ్యుల నిరసన

కాకినాడ రూరల్‌, డిసెంబరు 6: కాకినాడ రూరల్‌ మండలం కొవ్వూరు సర్పంచ్‌ పిల్లి చక్రరావు అనుచిత వ్యాఖ్యలతో పంచాయతీ కార్యదర్శి జి.రమే్‌షబాబు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పంచాయతీ పాలకవర్గ సమావేశం రసాభాసగా మారింది. గ్రామాభివృద్ధి పనుల సమాచారం తమకు తెలియడంలేదని పలువురు సభ్యులు సమావేశంలో సర్పంచ్‌ను ప్రశ్నించగా ఎవరికీ ఏవిధమైన సమాచారం చెప్పేది లేదనడంతో ఆవేదనకు లోనైన ఉపసర్పంచ్‌ పబ్బినీడి రమే్‌షబాబు, వార్డు సభ్యులు మరియమ్మ, శివశంకర్‌, గంగరాజు, గౌరీపార్వతి, ప్రసాద్‌, సూరిబాబు, ముసలయ్య, నందిని, రాణి, ధనలక్ష్మీ, సంధ్య,నూకరాజు, ధర్మారావు సమావేశాన్ని బహిష్కరించారు. పంచాయతీ కార్యాలయం వద్ద సభ్యులు నిరసన తెలిపారు.

Advertisement
Advertisement