భూములిచ్చిన రైతులకు సంకెళ్లు వేస్తారా?

ABN , First Publish Date - 2020-10-31T07:27:15+05:30 IST

రాజధానికి భూములిచ్చి, న్యాయం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు సంకెళ్లు వేస్తారా? అంటూ టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూములిచ్చిన రైతులకు సంకెళ్లు వేస్తారా?

 ప్రభుత్వ వైఖరిని ఖండించిన టీడీపీ


కడప, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజధానికి భూములిచ్చి, న్యాయం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు సంకెళ్లు వేస్తారా? అంటూ టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పిలుపు మేరకు శుక్రవారం కడపలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు ఎనలేని త్యాగం చేసి 33 వేల ఎకరాల భూములు ఇస్తే, మూడు రాజధానుల పేరిట వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. సామరస్యంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బేడీలు వేసి తీసుకెళ్లడం అన్యాయమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, అధికార ప్రతినిధి పీరయ్య, టీడీపీ నేతలు వికా్‌సహరి, సురేష్‌, జయచంద్ర, శ్రీను, చలపతినాయుడు, గురప్ప, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T07:27:15+05:30 IST