Abn logo
Sep 26 2020 @ 17:47PM

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు

కమలాపురం: రైజింగ్‌స్టార్‌ మొబైల్‌ ఇండియా శ్రీసిటీ నెల్లూరులో అర్హులైన వారికి ఉద్యోగావకాశాలున్నాయని జాబ్‌మిత్ర సుబ్బలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని జేఎంజే కాలేజీ దగ్గర ఉన్న టీటీడీసీలో ఈ నెల 30న ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నారు. బీఈ, బీటెక్‌తో పాటు ఏదైనా డిప్లమా పాసైనవారు అర్హులన్నారు. ఇంటర్వ్యూకు వచ్చువారు విద్యార్హత సర్టిఫికెట్‌, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఒరిజినల్‌ జిరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్టు కలర్‌సైజ్‌ ఫొటోలు తీసుకురావాలన్నారు. 

Advertisement
Advertisement