కరువు తీరా వాన

ABN , First Publish Date - 2020-08-02T11:13:50+05:30 IST

కరువు తీరా వాన

కరువు తీరా వాన

అత్యధికంగా మైదుకూరులో 90.2 మి.మీ వర్షం


కడప, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): వరుణుడు కరుణించాడు. భారీ వర్షాలతో మురిపించాడు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కడప, జమ్మలమడుగు డివిజన్లలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువుల్లోకి నీరు చేరింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఇంత భారీ వర్షం రావడం ఇదే తొలిసారి. జిల్లాలో 51 మండలాల్లో సగటున 39.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మైదుకూరు మండలంలో 90.2 మి.మీల వర్షం పడింది. కడప డివిజన్‌ పరిధిలో సగటు వర్షపాతం 41.7 మి.మీ కాగా అత్యధికంగా వల్లూరులో 89.2, ఖాజీపేటలో 75, చెన్నూరులో 65.2, చక్రాయపేటలో 85.7, రామాపురంలో 56.2, కమలాపురంలో 44, ఎర్రగుంట్లలో 44.8, వీరబల్లెలో 44.2, లక్కిరెడ్డిపల్లె 40.2, కడపలో 32.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పరిఽధిలో సగటు వర్షపాతం 36.4 మి.మీ కాగా అత్యధికంగా మైదుకూరు మండలంలో 90.2 మి.మీ కురిసింది. రాజుపాలెంలో 84.4, చాపాడులో 80.4, దువ్వూరులో 67.8, తొండూరులో 44.8, ప్రొద్దుటూరులో 57 మి.మీ వర్షపాతం కురిసింది. రాజంపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సగటున 39.7 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా నందలూరు మండలంలో 60 మిమీ వర్షం పడింది. రాజంపేటలో 44.8, పెనగలూరులో 36.4, ఓబులవారిపల్లెలో 42.4, బద్వేలులో 52.6, బి.మఠంలో 58, సిద్దవటంలో 58.6, అట్లూరులో 52.8, ఒంటిమిట్టలో 62.2 మి.మీ వర్షం పడినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. అత్యల్పంగా సింహాద్రిపురం మండలంలో 9.6 మి.మీ, వేముల 9.2, పులివెందులలో 6, కొండాపురంలో 9.4, గాలివీడు మండలంలో 8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. 


రాజుపాళెంలో..

రాజుపాళెం: రాజుపాళెం మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు  84.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో రాజుపాళెం, అయ్యవారిపల్లె, టంగుటూరు, తొండలదిన్నె మధ్య వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంకల ఉధృతితో ఆయా గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. 


Updated Date - 2020-08-02T11:13:50+05:30 IST