Abn logo
Aug 21 2021 @ 10:25AM

AP: ప్రొద్దుటూరులో మరోసారి విగ్రహాల ఏర్పాటు వివాదం

కడప: జిల్లాలోని ప్రొద్దుటూరులో మరోసారి విగ్రహాలు ఏర్పాటు వివాదం తలెత్తింది. వైసీపీ, బీజేపీ నేతల మధ్య వివాదం ముదురుతోంది. ప్రొద్దుటూరు బొల్లవరం సర్కిల్‌లో రాత్రి రాత్రికే అన్నమయ్య విగ్రహం వెలసింది. అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయరాదని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ స్ధానంలో టిప్పుసు ల్తాన్ విగ్రహం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. కాగా అనుమతి లేకుండా అన్నమయ్య విగ్రహం ఏర్పాటు అంశాన్ని అధికారులు, పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తెల్లవారేలోపే అన్నమయ్య విగ్రహాన్ని తొలగించారు. ఈ విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.