Abn logo
Jul 15 2021 @ 09:37AM

తమ్ముడిని దారుణంగా హత్య చేసిన అన్నలు

కడప: జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం గొల్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. శుభకిష్ణా రెడ్డి అనే వ్యక్తిని సొంత అన్నలే హత్య చేశారు. శుభక్రిష్ణారెడ్డి రాత్రి నిద్రిస్తుండగా అన్నలు నాగిరెడ్డి, పెద్దసుబ్బి రెడ్డిలు రోకలిబండతో కొట్టి చంపారు. ఈ ఘటనలో హతుడు భార్య, పిల్లలకు కూడా గాయాలయ్యాయి. అన్నదమ్ముల మధ్య ఆస్ధి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.