జ్యోతిరాదిత్య వర్సెస్ కమల్ నాథ్

ABN , First Publish Date - 2020-02-15T00:44:19+05:30 IST

సీఎం కమల్‌నాథ్, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కొన్ని

జ్యోతిరాదిత్య వర్సెస్ కమల్ నాథ్

న్యూఢిల్లీ  : సీఎం కమల్‌నాథ్, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కొన్ని రోజులు ఇద్దరూ స్తబ్దుగా ఉండిపోయారు. తాజాగా మేనిఫెస్టో హామీల అమలు విషయంలో ఇద్దరి మధ్యా తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయకపోతే మీకు నేను అండగా ఉంటా. మీరే భయపడకండంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు తిఖమ్‌గఢ్‌లోని గెస్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తానని సింధియా హామీ కూడా ఇచ్చారు.


‘‘మీ డిమాండ్ మాకు అత్యంత పవిత్రమైన మేనిఫెస్టోలో మేము పేర్కొన్నాం. ఈ హామీ నెరవేరడానికి ఒక సంవత్సరం మాత్రమే పడుతుంది. ఉపాధ్యాయులందరూ కొంత ఓపిక పట్టండి. ఒకవేళ అమలు కాకపోతే మీకు నేను పూర్తిగా అండగా ఉంటా. మీరేం ఒంటరి కారు. మీతో పాటు నేనూ వీధుల్లోకి వచ్చి పోరాడతా’’ అని సింధియా వ్యాఖ్యానించారు.  మరోవైపు సింధియా వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. మేనిఫెస్టో అనేది ఐదేళ్లకు సంబంధించిన అంశమని, ఐదు నెలలకు సంబంధించిన అంశం కాదని కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని కమల్ నాథ్ హామీ ఇచ్చారు.  

Updated Date - 2020-02-15T00:44:19+05:30 IST